రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
BHPL: మున్సిపాలిటీ పరిధిలోని 11 కేవీ శాంతినగర్ ఫీడర్ మరమ్మతులు, చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా రేపు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని EA విశ్వాస్ రెడ్డి ఇవాళ తెలిపారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి కాలనీ, శాంతినగర్, బాంబులగడ్డ కాలనీలో విద్యుత్ అంతరాయం కలుగనుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.