పెరిగిన పత్తి ధరల వివరాలు..

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర భారీగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,630 పలకగా.. గురువారం రూ.7,720కి చేరింది. ఈవారం మొదటి నుంచి పత్తి ధరలు చూస్తే.. సోమవారం రూ.7,620, మంగళవారం రూ.7,640, బుధవారం రూ.7,630 పలికాయి. మార్కెట్‌లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.