తురుకపాలెం పరిసర జలాల్లో యురేనియం అవశేషాలు

AP: తురకపాలెంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణమని తెలుస్తోంది. ఈ గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి అధ్యయనం చేయిస్తున్నారు. చెన్నైకి పంపిన నీటి నమూనాల ఫలితాలు వెల్లడైనట్లు సమాచారం. అందులో తురకపాలెం పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.