మొక్కజొన్నకొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మొక్కజొన్నకొనుగోలు కేంద్రాలు ప్రారంభం

SDPT: అక్కన్నపేట మండలం కట్కూర్‌లో ఇవాళ మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను గ్రామ సర్పంచ్ ముంజ బాలరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగంపల్లి ఐలయ్య ప్రారంభించారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కేంద్రాలకు పంటను విక్రయించి, ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.