'ప్రతి వ్యాపారి ట్రేడ్ లైసెన్స్ తప్పకుండా తీసుకోవాలి'
MNCL: జన్నారంలోని నూతన వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తప్పకుండా తీసుకోవాలని పోన్కల్ పంచాయతీ ఈవో రాహుల్ కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జన్నారంలో చాలామంది నూతన వ్యాపారాలు ప్రారంభించారన్నారు. వారందరూ చట్టపరంగా ట్రేడ్ లైసెన్సులను గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాలని సూచించారు. గతంలో ట్రేడ్ లైసెన్స్ ఉండి గడువు తీరిన వారు లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలన్నారు.