VIDEO: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదం
VZM: నెల్లిమర్ల నగర పంచాయతీలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మాటలు వాగ్వాదానికి దారి తీశాయి. సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. అభివృద్ధి అంతా ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో పక్షపాతం చూపించిందని టీడీపీ కౌన్సిలర్లు ఎద్దేవా చేశారు.