VIDEO: ఆందోళనలో లంక గ్రామాల రైతులు

VIDEO: ఆందోళనలో లంక గ్రామాల రైతులు

కృష్ణా: ప్రకాశం బ్యారేజీ నుంచి వరద ఉధృతి పెరగడంతో తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాలు మళ్లీ నీట మునిగే ప్రమాదంలో ఉన్నాయి. పసుపు, చెరకు, అరటి వంటి పంటలు సాగుచేసిన వేలాది ఎకరాల్లో ముంపు భయం అలుముకుంది. గ్రామస్తులు, రైతులు, కూలీలు పడవలపై ప్రయాణిస్తున్నారు. “ఇంకా వరద పెరిగితే మళ్లీ పంటలన్నీ పోతాయి” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.