రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పాలు, పండ్లు పంపిణీ

KMR: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధారిలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. నిరుపేదల సేవయే రెడ్ క్రాస్ సొసైటీ ధ్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ అన్నారెడ్డి, వైస్ ఛైర్మన్ బిట్ల గంగయ్య, కిషన్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.