'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

యాదాద్రి: రైతులకు యూరియాను సరఫరా చేయాలని, వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ భువనగిరి మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ప్రణయ్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.