VIDEO: రోడ్డు పక్కనే చెత్తా చెదారం
SKLM: ఎచ్చెర్ల మండలం పూడివలస సమీపంలో రోడ్డు పక్కనే చెత్తా చెదారం పోగులుగా వేయడంతో దుర్వాసన అధికంగా వస్తుందని వాహనదారులు అంటున్నారు. స్థానికంగా ఇళ్లల్లోనూ, షాపులలోను ఉపయోగించే వ్యర్థ పదార్థాలను రోడ్డు పక్కనే వేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి, చెత్తాచెదారాన్ని తొలగించే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.