గల్లీలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ.. చర్యలేవి.?

గల్లీలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ.. చర్యలేవి.?

MDCL: మేడ్చల్ పరిధి కిష్టాపూర్ రహదారిలో మల్లన్న టెంపుల్ అనామిక హోమ్స్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్డుపై పొంగిపొర్లుతోంది. దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడ ప్రజలు చెప్పుకొచ్చారు. రోడ్డు సదుపాయం సైతం సరిగ్గా లేదని, దీనిపై అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులకు చేసే ఫిర్యాదులు కేవలం పేపర్లకే పరిమితం అవ్వటం ఏంటని స్థానికులు వాపోతున్నారు.