జూబ్లీహిల్స్ బరిలో పాలమూరు బిడ్డ అస్మా
MBNR: కౌకుంట్ల మండలం తిర్మలాపూర్‌కు చెందిన షేక్ హుస్సేన్, సాబేర బేగం కుమార్తె అస్మా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. ఎం.ఏ. తెలుగు పూర్తి చేసిన ఆమె గతంలో నిరుద్యోగుల తరఫున పోరాటం చేశారు. అస్మా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆమెకు సంపూర్ణ మద్దతు తెలిపింది.