పటాన్ చెరువులో 14 ఏళ్ల బాలుడు మిస్సింగ్
SRD: పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. జేపీ కాలనీకి చెందిన రవీందర్ కుమారుడు తేజ (14) 8వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజులుగా స్కూల్‌కు వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో ఈ నెల 21న సాయంత్రం ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.