VIDEO: అయిజలో ఘనంగా రంజాన్ ప్రార్థనలు
GDWL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అయిజ పట్టణ శివారులోని ఈద్గా వద్ద ముస్లింలు భారీగా తరలి వచ్చారు. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాసాన్ని ముగించారు. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో ఈద్గా పరిసరం జనసంద్రంగా మారింది.