'కంటయాపాలెంను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా'
MHBD: జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్‌ల పర్వం రెండో రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కంటయపాలెం గ్రామ సీపీఎం పార్టీ సర్పంచ్ అభ్యర్థినిగా M.D అఫ్జల్‌బీW/o యాకుబ్ ఆ పార్టీ నాయకులు బలపరిచారు. కాగా ఇవాళ మడిపెల్లి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల సమక్షంలో ఆమె నామినేషన్ వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చుదిద్దుతానని భరోసానిచ్చారు.