గంజాయి విక్రయిస్తున్న యువకులు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న యువకులు అరెస్ట్

వరంగల్ శివనగర్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బొడ్డుచింతలపల్లి గ్రామానికి చెందిన కేదాసి సుదీప్, వాడేపల్లె సాయివర్ష, అన్నబోయిన ఉదయ్ శివనగర్ బతుకమ్మ ఆట స్థలంలో ఆటోలో కూర్చొని గంజాయి తాగుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 20 గ్రాముల శుద్ది చేసిన ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నామని సీఐ రమేశ్ తెలిపారు.