పచ్చకామెర్లు ముదిరి గిరిజన బాలిక మృతి

అల్లూరి జిల్లా: అనంతగిరి మండలం, బొర్రా పంచాయతీ జీరుగెడ్డ గ్రామంలో విశాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మామిడి సోమేశ్, సుజాత దంపతుల కుమార్తె దేవిశ్రీ 6 సం.. మూడు రోజుల నుండి అనారోగ్యానికి గురై పచ్చకామెర్లు ముదిరి శనివారం మధ్యాహ్నం మృతి చెందిందనీ కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక మృతితో జీరుగెడ్డ గ్రామంలో విశాద చాయలు అలుముకున్నాయి.