నేడు నందిగాం మండలంలో మంత్రి పర్యటన
SKLM: నందిగాం మండలంలోని పలు గ్రామాలలో శనివారం రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు పర్యటించనున్నట్లు మంత్రి క్యాంప్ కార్యాలయం ముందు ఒక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా పలు రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.