మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మేయర్

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మేయర్

MBNR: మహిళల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మేయర్ మమత అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 22, 43 డివిజన్లలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో నాణ్యమైన చీరలను పేద మహిళలకు అందజేస్తోందని పేర్కొన్నారు. మహిళల సాధికారతకు అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.