తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత

తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత

VKB: పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. బోపునరం గ్రామానికి చెందిన విమలమ్మకు తట్టేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 30/అ2/అలో 4 ఎకరాలు 09 గుంటల భూమి ఉంది. ఆ భూమి పై కన్నేసిన ఒక పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే పేరును వాడుకుంటూ తనకు ఆ భూమి అమ్మాలని ఒత్తిడి తెచ్చాడు. వారు ఒప్పుకోకపోవడంతో భూమిని అక్రమ మార్గంలోకాజేయాలని చూశాడు.