మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కమిషనర్

మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కమిషనర్

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ అనురాధ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్, సిడి ఫైల్స్ తనిఖీ చేశారు. ప్రతి రికార్డ్ అప్డేట్‌గా ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. సాయం కోసం వచ్చే ప్రజలను భరోసా కల్పించాలన్నారు. ప్రజల భద్రత విషయంలో రాజీ పడవద్దని సూచించారు.