వెంకటాచలంలో పర్యటించిన మాజీ మంత్రి

వెంకటాచలంలో పర్యటించిన మాజీ మంత్రి

నెల్లూరు: మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి శనివారం వెంకటాచలం(మం) గొట్లపాలెంలో పర్యటించారు. ధాన్యం ధరలు రోజురోజుకు దిగజారుతుండడం రైతులకు ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. ధాన్యం ధరలు తగ్గుముఖం పట్టకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని, దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.