జీఓ నంబర్ 99ను సవరించాలని నిరసన

MNCL: రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 99ను సవరించాలని సోమవారం జాతీయ మాల మహానాడు మంచిర్యాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గరిసె రామస్వామి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీఓ 99లో రోస్టర్ పాయింట్లు 22 నుంచి 16కు తగ్గించి మాలలకు న్యాయం చేయాలని కోరారు.