పదో తరగతి విద్యార్థినికి అండగా నిలిచిన బాలిక

పదో తరగతి విద్యార్థినికి అండగా నిలిచిన బాలిక

సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన బోయ చిరంజీవి కుమార్తె శ్రావణి చిన్న వయసులోనే సేవాభావం చాటుకుంది. శ్రావణి సోమందేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. నాగినాయిని చెరువు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని రాజేశ్వరికి కంటిచూపు తక్కువగా ఉండటంతో ఆమెకు సహాయంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయడానికి శ్రావణి ముందుకు వచ్చింది.