ఆదిత్యనీ ఆదాయం రూ.10,38,252

ఆదిత్యనీ ఆదాయం రూ.10,38,252

SKLM: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైశాఖమాసం ప్రారంభం సందర్భంగా వేకువజాము నుంచి క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. ఆదివారం ఒక్కరోజు స్వామివారికి రూ.10,38,252 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల ద్వారా రూ.7,36,000, విరాళాల ద్వారా రూ.98,252, ప్రసాదాలు అమ్మకం ద్వారా రూ.2,04,000 లభించిందని ఈవో శోభారాణి తెలియజేశారు.