అన్నా భావు సాఠే విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే

అన్నా భావు సాఠే విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే

KMR: సాహిత్యరత్న లోక షాహీర్ అన్నా భావు సాఠే 105వ జయంతి సందర్భంగా.. జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నా భావు సాఠే విగ్రహావిష్కరణ వేడుకకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.