డబ్బు కోసం తుపాకుల దందా

డబ్బు కోసం తుపాకుల దందా

HYD: డబ్బు సంపాదించడం కోసం ఇద్దరు బిహార్ వాసులు తుపాకుల దందా మొదలు పెట్టారు. బిహార్ నుంచి అక్రమంగా మూడు దేశవాళీ తుపాకులు, 10 రౌండ్ల తూటాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమ్మకానికి ప్రయత్నించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద నిఘా పెట్టిన మల్కాజిగిరి SOT పోలీసులు శివకుమార్ అనే నిందితుడిని పట్టుకున్నారు.