సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సందర్శించిన ఏసీపీ
MNCL: కన్నెపల్లి మండలంలోని సమస్యాత్మాకంగా ఉన్న నాయికంపేట పోలింగ్ స్టేషన్‌ను ఇవాళ ఏసీపీ రవికుమార్ సందర్శించారు. గ్రామస్తులను కలిసి వారితో మాట్లాడుతూ.. రాబోవు గ్రామపంచాయతీ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. యువకులు ఎటువంటి రాజకీయ గొడవలలో తలదూర్చి కేసుల పాలు కావొద్దన్నారు.