గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

TPT: చింతల చేను రైల్వేగేట్ సమీపంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న కదంబూరు రమేష్‌ను ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రమేశ్ ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరో ఇరువురి కోసం గాలింపు చర్యలు చేపట్టాగా, పట్టుపడ్డ ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హేమాద్ర తెలిపారు.