నేపాల్ దేశానికి యువతి సైకిల్ యాత్ర

ATP: అనంతపురం నుంచి నేపాల్ దేశానికి సమీరా ఖాన్ అనే యువతి సైకిల్ యాత్ర చేపట్టింది. ఆమెకు సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎమ్మెల్యే బండార శ్రావణి ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందించింది. మహిళా సాధికారత, మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాల నిర్మూలనకై అవగాహన కల్పించేందుకు సమీరా ఖాన్ ఈ యాత్ర చేపట్టడం గొప్ప విషయమని కొనియాడారు.