ఇళ్ల స్థలాలకు 2,335 మంది దరఖాస్తు

ఇళ్ల స్థలాలకు 2,335 మంది దరఖాస్తు

AKP: ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకునే గడువు ఆదివారంతో పూర్తయినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలో 25 పంచాయతీల్లో ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరుకు మొత్తం 2,335 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు అన్ని సచివాలయాల్లోనూ స్వీకరించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఎస్సీలు 253 మంది, ఎస్టీలు 39 మంది ఉన్నారన్నారు.