ఘనంగా ఉరుసు మహోత్సవం

ఘనంగా ఉరుసు మహోత్సవం

SKLM: ఉరుసు మహోత్సవం అందరికీ ఒక పండుగలాంటిదని MLA గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో స్థానిక బలగ బూబమ్మ నగర్ దర్గాలో ఖురాన్ ఖాని, ఫజర్ నమాజ్ అనంతరం సందల్ (చందనోత్సవం), లంగర్ విందు బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఫతే షాబీబీ అమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.