VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
BHPL: కాటారం మండల కేంద్రంలోని గారెపల్లి అంబేద్కర్ కూడలిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రాజయ్యగా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, రాజయ్య ముందుగా ఆర్టీసీ బస్సు కింద పడేందుకు ప్రయత్నించగా డ్రైవర్ తప్పించడంతో వెనుక నుంచి వచ్చిన లారీ కింద పడి మృతి చెందాడు.