ఫోటో ఫ్రేమ్ అమ్మకంపై ఫోటోగ్రాఫర్ల ఆందోళన

ఫోటో ఫ్రేమ్ అమ్మకంపై ఫోటోగ్రాఫర్ల ఆందోళన

KNR: చొప్పదండి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్, గిఫ్ట్ ఆర్టికల్స్,  జనరల్ స్టోర్స్‌లో ఫోటో ఫ్రేమ్స్ అమ్మడం వల్ల ఉపాధి దెబ్బతింటుందని శనివారం ఎస్ఐ నరేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకు నాసిరకం ఫ్రేములు అమ్ముతూ తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని, వారిని ఫోటో ఫ్రేమ్స్ అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు.