'అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

'అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

MNCL: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జన్నారం ఎఫ్డిఓ రామ్మోహన్ రావు అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం జన్నారంలోని ఎఫ్డిఓ కార్యాలయం ఆవరణలో అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ అధికారులు, సిబ్బంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జన్నారం ఎఫ్ఆర్ఓ సుష్మారావు, సిబ్బంది ఉన్నారు.