BSNL టవర్‌లో బ్యాటరీలు చోరీ

BDK: బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో ఉన్న BSNL టవర్‌లో దొంగలు హల్ చల్ చేశారు. టవర్‌లో ఉన్నటువంటి 48 HBL బ్యాటరీలు, కాపర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. గమనించిన సైట్ ఇంజనీర్ గణేష్ బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.