ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అధికారులు
నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో PGRS కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా నిర్వహించారు. ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్, డీఆర్‌వో, జిల్లా పంచాయతీ అధికారి, డీఆర్డీఏ పీడీలు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.