VIDEO: డ్రగ్స్ నిర్మూలనపై వినూత్న రీతిలో ప్రచారం
SRPT: నూతనకల్‌లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై మద్దిరాల మండలం గోరంట్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ వినూత్న రీతిలో బుధవారం ప్రచారం చేశారు. గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తనదైన శైలిలో ప్రచారం నిర్వహించాడు. మత్తు బారిన పడి యువత జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.