సబ్‌స్టేషన్‌కు లేని రక్షణ.. పొంచి ఉన్న ప్రమాదం..!

సబ్‌స్టేషన్‌కు లేని రక్షణ.. పొంచి ఉన్న ప్రమాదం..!

SRPT: అనంతగిరిలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ప్రహరీ గోడ లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ కేంద్రంలోకి పశువులు, చిన్నపిల్లలు వెళ్లే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర పరికరాలు ఉన్నప్పటికీ రక్షణ కవచం లేకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ప్రహరీ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.