పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం

VZM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, SDPS, ఫోక్సో, అట్రాసిటీ, రోడ్డు ప్రమాద కేసులు, లాంగ్ పెండింగ్ కేసులపై సమీక్షించారు. న్యాయస్థానాలను సంబంధిత అధికారులు తరచూ సందర్శించి కేసుల ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరును గమనించాలన్నారు.