చికిత్స పొందుతూ హోమ్ గార్డు మృతి

చికిత్స పొందుతూ హోమ్ గార్డు మృతి

W.G: పాలకొల్లు మండలం ఉల్లంపర్రు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన హోంగార్డు రఘుమండ వెంకటరమణ(56) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. పోడూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆదివారం రాత్రి బైకుపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయనను విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.