వైన్స్ ముందు బారులు తీరిన మందుబాబులు

వైన్స్ ముందు బారులు తీరిన మందుబాబులు

KNR: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, మొలంగూర్ గ్రామాల పరిధిలో వైన్స్ ముందు మందు బాబులు బారులు తీరారు. ఈ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల కోడ్ ముగియడంతో రెండు రోజులుగా మూతపడిన వైన్స్ తెరుచుకున్నాయి. అప్పటికే పలువురు మద్యం ప్రియులు షాపుల ముందు క్యూ కట్టారు. పలు వైన్స్‌లో మద్యం కేవలం రెండు గంటలలో ఖాళీ అయినట్లు మద్యం ప్రియులు తెలిపారు.