21న జాబ్ మేళా.. ఎక్కడంటే.?
ATP: ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు ఈనెల 21న రుద్రంపేట కోర్టు రోడ్డు సమీపంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పల్లవి తెలిపారు. ఫ్లిప్ కార్ట్ సంస్థలో డెలివరీ బాయ్స్, గర్ల్స్ ఉద్యోగాలకు ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి ఆపై చదివి 18 నుంచి 35 సం.రాల లోపు వయసు కలిగిన వారిని అర్హులుగా పేర్కొన్నారు.