ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సన్నాహక సమావేశం

RR: చేవెళ్ల పట్టణంలోని KGR గార్డెన్స్లో చేవెళ్ల నియోజకవర్గ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేదల కల అయిన సొంతింటి ఆశయాన్ని సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిందన్నారు.