విశాఖలో పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నీ
VSP: ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఈ నెల 10 నుంచి 14 వరకు విశాఖలోని ఎంవీపీ కాలనీ ఎస్-3 స్పోర్ట్స్ ఎరీనాలో జరగనుంది. విశాఖ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఎన్.వీ.ఎస్.ఎన్. రాజు శుక్రవారం ఈ వివరాలను వెల్లడించారు. ఈ పోటీలలో 14 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.