పాఠశాల ఎదుట ధర్నా

పాఠశాల ఎదుట ధర్నా

JGL: జిల్లా కేంద్రంలో ఈ నెల 6న రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ యువకున్ని ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ బంధువులు ఇవాళ స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రమాదం జరిగి 15 రోజులు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడమే కాకుండా, నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్య ఖర్చులు భరించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.