ఇరాన్ దాడులు... తెలుగువారి పరిస్థితిపై స్పీకర్ ఆరా

ఇరాన్ దాడులు... తెలుగువారి పరిస్థితిపై స్పీకర్ ఆరా

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బహ్రెయిన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దేశంలో ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 50 వేల మంది నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహ్రెయిన్‌లోని ప్రవాస తెలుగువారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీఎన్ ఆర్టీ ద్వారా సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.