ఘనంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు
KMM: ఏన్కూరులో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం ఆలయంలో పంచామృతాభిషేకం, బిల్వార్చన, రుద్ర హోమం, పూర్ణాహుతి, శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణానికి వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మెక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.