ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

MBNR: మిడ్జిల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బస్ స్టాండ్‌లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జర్నలిస్ట్ బండి అజయ్ కుమార్ ముదిరాజ్‌ను కిడ్నాప్ చేసి దాడి చేసిన పాడి కౌశిక్ రెడ్డి మరియు అతని అనుచరులపై కిడ్నాప్ కేసు మరియు హత్య ప్రయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలన్నారు.