'అక్రమ బెల్టు షాపులు అరికట్టకపోతే ఉద్యమం ఉధృతం'

W.G: భీమవరం సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఏపీ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహామూర్తి మాట్లాడారు. అక్రమ బెల్టు షాపులు పూర్తిగా అరికట్టే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఈనెల 30న ఎక్సైజ్ జిల్లా కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు.